ఏపీలో ప్రస్తుతం జీవో నెంబర్ 1 గురించి సర్వత్రా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ సభలో జరిగిన పలు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీలోని రోడ్ల మీద ర్యాలీలు, సభలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది. అయితే.. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. జీవో పేరుతో ప్రతిపక్ష పార్టీలను ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోకుండా ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలను పాల్పడుతోం...
నందమూరి తారకతర్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇంకా చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. మరోవైపు బెంగళూరుకు నందమూరి కుటుంబ సభ్యులు బయలుదేరారు. సాయంత్రం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరుకు రానున్నారు. టీడీపీ ముఖ్య నేతలు కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ నారాయణ...
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ది ఐరన్ లెగ్ అని.. అందుకే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ దారుణాలు జరుగుతాయని పరోక్షంగా చెప్పారు. ఆయన తండ్రి చంద్రబాబు సైకో అయితే.. అతడి కుమారుడు లోకేశ్ ఐరన్ లెగ్.. సైకో అని తెలిపారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా లోకేశ్ గతంలో తనపై రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు కూడా భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే రెండో రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. పేస్ వైద్య కళాశాల నుంచి ప్రారంభం అయింది. అక్కడి నుంచి బెగ్గిలిపల్లె దగ్గర లోకేశ్ ప్రసంగించారు. ఆ తర్వాత కడపల్లెలో ఇంటరాక్షన్, అక్కడి నుంచి కలమలదొడ్డిలో ఇంటరాక్షన్ అయిపోయాక.. అక్కడి నుంచి శాంతిపురం క్యాంపు వద్ద రెండో రోజు పాదయాత్ర ముగిసింది. అద్భుత ప్రజాస్పందన, అపూర్వ జ...
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో సీబీఐ టీమ్ ప్రశ్నలు సంధిస్తోంది. అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే.. న్యాయవాదిని మాత్రం సీబీఐ అధికారులు అనుమతించలేదు. సీబీఐ ఆఫీసుకు అవినాష్ అనుచరులు భారీగా తరలివచ్చారు. సీబీఐ ఆఫీసుకు వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు చేరుకున్నారు. వైఎస్ వివేకానంద హత...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు వరుసగా రెండు రోజులు రద్దయ్యాయి. ముందే నిర్ణయించిన పర్యటనలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. కార్యక్రమాలను వరుసగా రద్దు చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగం కావడమేనని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ కేసు విచారణ వేగం పెరిగింది. సీబీఐ రంగంలోకి దిగి తన సోదరుడు, వైఎస్సా...
నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని వైద్యులు తెలిపినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి తారకరత్నతోనే ఉన్నారు. ఇవాళ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. న...
దేశమంతా గణతంత్ర వేడుకల్లో మునిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని మాచర్లలో మాత్రం రౌడీల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసే విషయంలో మొదలైన వివాదం పరస్పరం వీధి రౌడీల్లా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ పాఠశాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. బాహాబాహీకి దిగడంతో విద్యార్థులు భయాందోళనలతో ఇళ...
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...
వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్తూ వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకున్నారు. అవినాశ్ స్టేట్ మెంట్...
నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...
ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ తొలి అడుగు వేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. అధికారం కోసమైతే లోకేష్ 400రోజులు 4వేల ...
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు జారీచేసింది. దర్యాప్తునకు హాజరుకావాలంటూ సూచించింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు...