ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ సోమవారం మంగళగిరి ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ సతీమణి భారతీ లక్ష్యంగా విజయ్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతి పే’ అని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఐ- టీడీపీ ద్వారా పోస్ట్ సర్క్యులేట్ చేశారని సీఐడీ పోలీసులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీన కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో గల విజయ్ ఇంటికెళ్లి 41 సీఆర్పీసీ [&hell...
విశాఖ శ్రీ శారదాపీఠంని మంత్రి రోజా సందర్శించారు. అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలో భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం పర్యాటక శాఖ తీసుకుంటున్న చర్యలు స్వామివారికి మంత్రి వివరించారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్నటువంటి చర్యలు తన దృ...
భారతీయుడు-2 చిత్రీకరణ కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లాకు వచ్చాడు. చిత్రీకరణ కోసం ఆరు రోజుల పాటు కడపలో ఉండనున్నాడు. అయితే షూటింగ్ కోసం వచ్చిన కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రజలు భారీగా తరలిరావడంతో కమల్ హాసన్ బయటకు వచ్చి పలకరించారు. అందరికీ నమస్కారం అంటూ చేతులు ఊపారు. దీనివలన షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడింది. అయినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్...
పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని సోమవారం విడుదల చేయనున్నారు. 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేయనున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హు...
సీఎం జగన్‌పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్నీ వర్గాలను ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఉద్యోగులను కూడా వదలడం లేదన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఇదే పరిస్థితి అని వివరించారు. పోలీసులు గవర్నమెంట్ వద్ద జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ పేరుతో కొంత సొమ్ము జమ చేస్తారు. దానిని పిల్లల చదువు.. లేదంటే పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకునే అవసరాలకు వాడుకుం...
పరిపాలన రాజధానిగా కొన్ని నెలల్లో విశాఖపట్టణాన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు కార్యాలయాలు తరలించేందుకు సిద్ధమైంది. విశాఖ నుంచే పరిపాలన సాగించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఇక ఏపీ రాజధాని విశాఖనే అని చాటి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అందుకే అన్ని కార్యక్రమాలకు విశాఖతో...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభమై.. రాత్రి 7.20 గంటలకు ముగియనుంది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను లోకేశ్ కలిసి, సమస్యలను తెలుసుకుంటున్నారు. యాత్రకు మహిళలు బ్రహ్మారథం పడుతున్నారు. స్వాగతం పలికి, వీర తిలకం దిద్దుతున్నారు. తమ సమస్యలు లోకేశ్‌తో చెప్పుకుంటున్నారు. చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి నాలుగో రోజు (సోమవారం) ...
అంతా భావిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమ, మంగళవారాల్లో జగన్ దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. వన్ జన్‌పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ రౌండ్ టేబుల్ స...
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో జగన్ సర్కార్ చర్యలను ఎండగట్టారు. జగన్‌ను నమ్మి అధికారం అప్పగిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీతో అధికారం చేపట్టి, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కుప్...
సీబీఐ విచారణకు వెళ్లే ముందు వైఎస్ విజయమ్మను అవినాశ్ రెడ్డి కలవడం వెనుక ఆంతర్యమేమిటని టీడీపీ శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 5 రోజుల గడువు దేనికి అని నిలదీశారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా ముత్యం అని అనివాశ్ రెడ్డిని ఎద్దేవా చేశారు. హత్య కేసు విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్న అవినాశ్ అసలు వివేకానందరెడ్డి హత్య జరి...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఏ విషయంలో క్లారిటీ లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి రజని పాల్గొన్నారు. పాదయాత్ర ఎందుకో.. ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్టు...
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన్నారు. 12 సిమ్ కార్డులు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ను పెగాసస్ రికార్డు చేయలేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్...
నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పాలనలో ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శలు చేశారు. తిరుమలలో అధికారుల తీరుపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖుల సేవలో టీటీడీ తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే...
ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం, జనసేన పొత్తుపై కూడా అంబటి స్పందించారు. ఎంతమంది కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. మళ్లీ జగన్ ముఖ్య...