ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ భారీ కుదుపు కుదిపింది. రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం బహిర్గతం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆడియోలను విడుదల చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అని నిలదీశారు. అనుమానం ఉన్న చోట తాను ఉండలేను అని ప్రకటించారు. ‘ప్రజా సమ...
కామం మైకంలో అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు ఎగబడ్డాడు. అతడి పైశాచిక ప్రవర్తనకు భయాందోళనకు గురైన బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయినా వదల్లేదు. తలుపులు పగులగొట్టి బాలికను పట్టుకున్నాడు. కేకలు వేస్తుండడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక నోట్లో యాసిడ్ పోసి అతి క్రూరంగా ప్రవర్తించాడు. యాసిడ్ బాధకు విలవిలలాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసి...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తు...
మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. విచారణను వేగవంతం చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాశ్ రెడ్డితో విచారణ అనంతరం మరికొందరికి నోటీసులు పంపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎంవోలో అతి ముఖ్యమైన వ్యక్తికి కూడా నోటీసులు పంపడం ఏపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఇంట్లోని మనిషికి నోటీసులు అందడంతో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు మరకలు సీఎం ఇంటిన...
ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ము...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని, విశాఖ రాజధాని కాబోతుందని, త్వరలో తాను కూడా షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధాని మొత్తం అక్కడకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. అలాగే, రాజధాని అంశం సుప...
తెలుగుదేశం పార్టీ హయాంలో కరువు విలయ తాండవం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న కొన్ని వార్తా సంస్థలు ప్రచురించడం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మీడియాకు వెల్లడించారు. టీడీపీ హయాంలో పంటలు పండించకపోవంతో కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచే...
ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. జగన్ అభద్రతాభావంతో ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్యకేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తీసుకువస్తోందని తెలిపారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే విశాఖ రాజధాని వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ కాల్ రికార్డులను పరిశీలించగా నవీన్‌తో ఎక్కువ మాట్లాడినట్టు గుర్తించారు. నవీన్.. సీఎం జగన్ భార్య భారతి పీఏ అని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నవీన్ పాత్రపై సీబీఐ అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు జారీచేశారు. నవీన్‌కు నోటీసులు ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జగన్ పాలనలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తమ పార్టీయేనని చెప్పారు. ...
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణం అవనుందని సీఎం జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అప్పుడే ఎలా మాట్లాడతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టుని కూడా సీఎం జగన్ గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదీ జగన్ నిరంకుశ వైఖరికి నిదర్శనం ...
వైసీపీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ జాబితాలో ఆనం రాం నారాయణ రెడ్డి కూడా చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆనం రాం నారాయణ రెడ్డి జాయిన్ అయ్యారు. గత ఏడాదిన్నర నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలులేకుండా...
ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. వివిధ అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. వైయస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచిందని గుర్తు చేశారు కేశవ్. ఇలాంటి సమయంలో అందరి దృష్టిని మళ్లించడానికి జగన్ హఠాత్తుగా విశాఖ రాజధాని పాట పాడుతున్నారన్నారు. వివేకా హత్య జరిగిన రోజున కడప ఎంపీ అవినాష్ ర...
ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉందని, గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రమైన చలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలు దంచి కొడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్ల...
తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్‌గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం...