కామం మైకంలో అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు ఎగబడ్డాడు. అతడి పైశాచిక ప్రవర్తనకు భయాందోళనకు గురైన బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయినా వదల్లేదు. తలుపులు పగులగొట్టి బాలికను పట్టుకున్నాడు. కేకలు వేస్తుండడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక నోట్లో యాసిడ్ పోసి అతి క్రూరంగా ప్రవర్తించాడు. యాసిడ్ బాధకు విలవిలలాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడికి 14 ఏళ్ల కూతురు ఉంది. గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన కుటుంబసభ్యులు నెల్లూరుకు వెళ్లగా బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇది గమనించిన వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. భయంతో బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంది. కామం మైకంలో ఉన్న అతడు వదలలేదు. తలుపులు పగులగొట్టి బాలికను చెరబట్టాడు. అరుపులు వేయడంతో బాలిక నోట్లో యాసిడ్ పోశాడు. యాసిడ్ తీవ్రతకు బాలిక తట్టుకోలేకపోయింది. విలవిలలాడడంతో దుండగుడు పారిపోయాడు. ఇరుగుపొరుగు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మంగళవారం కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.