పల్నాడు: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరూ ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్టమస్ పండుగని లూథరన్ చర్చి ఫాదర్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం రాత్రి మాచవరం గుర్రం జాషువా కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల వేషధారణ ధరించి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కేక్‌ను ఏర్పాటు చేసి చిన్నారులకు పంపిణీ చేశారు.
CTR: శాంతిపురం(M) గుండి శెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మహేంద్ర విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గుండిశెట్టిపల్లి సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు మహేంద్ర(17) విద్యుత్ షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేంద్ర శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
కోనసీమ: విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సరఫరా చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా సీఈఓ లక్ష్మణ్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం సీఈవోకు ఎమ్మెల్సీ లేఖ రాశారు. విద్యార్థులకు తక్షణమే స్టడీ మెటీరియల్ అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ATP: గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామికి మంగళవారం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు ప్రాకారోత్సవం నిర్వహించారు. వేకువజాము నుంచి ఉత్సవమూర్తికి విశేష పుష్పాలతో అలంకరించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
CTR: హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్ హాల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV. సింధు, వెంకటదత్తసాయి దంపతులను మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.
GNTR: వైద్యఖర్చుల నిమిత్తం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పంపిణీ చేశారు. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని పూర్తిగా దుర్వినియోగం చేసిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
కోనసీమ: సముద్రపు తీర ప్రాంత భద్రతను మరింత మెరుగుపరచే విధంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో విశాఖపట్నం కోస్టల్ సెక్టార్ పోలీస్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, కోస్ట్ గార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
W.G: కాళ్ల మండలం పెదమిరం మహాత్మాగాంధీ క్యాన్సర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమీపంలో గల నీటిపారుదల శాఖకు సంబంధించిన మూడున్నర ఏకరాల భూమిని సంబంధిత శాఖ అధికారులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన మ్యాపులను, స్థలాన్ని పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించామన్నారు.
కడప: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో విమాన గోపురంలో బంగారు కలశం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈరోజు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో బంగారు కలశం నిర్మాణానికి సంబంధించి 43లక్షల రూపాయలతో చేపట్టడానికి పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.
కడప: తనపై వైసీపీ నేత సుబ్బారెడ్డి దాడి చేశాడని ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లికి చెందిన చిన్నపు బ్రహ్మయ్య తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డి నిర్మిస్తున్న కాంప్లెక్స్ విద్యుత్ వైర్లు చోరీకి గురికావడంతో అవి తాను తీశాననే అనుమానంతో తనపై దాడి చేశారని బ్రహ్మయ్య తెలిపారు.
ATP: సమస్యాత్మక గ్రామాలపై నిరంతర నిఘా కొనసాగించాలని జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డుల నిర్వహణ, పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కీలక కేసుల పురోగతి, సీడీ ఫైళ్లపై సమీక్షించారు. కేసుల ఛేదనపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
CTR: మాజీ మంత్రి రోజా నేటి షెడ్యూల్‌ను ఆమె కార్యాలయం విడుదల చేసింది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు నగరి మున్సిపాలిటీ 9వ వార్డు నత్తంకండ్రిగ గ్రామంలో వైసీపీ నాయకులు కృష్ణమూర్తి నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం 5:30 గంటలకు నగరి పట్టణం నాగలాపురం రోడ్‌లో గల సీఎస్ఐ చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
కడప: ఏపీ సచివాలయంలో మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడిని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
కృష్ణా: రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేటి కార్యక్రమ వివరాలను కార్యాలయ సిబ్బంది విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు చాట్రాయి మండలం చిత్తూరులోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 11 గంటలకు తుమ్మగూడెంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లోనూ, మధ్యాహ్నం 12 గంటలకు చాట్రాయిలోని ఆర్సీఎం చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
కృష్ణా: రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేటి కార్యక్రమ వివరాలను కార్యాలయ సిబ్బంది విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు చాట్రాయి మండలం చిత్తూరులోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 11 గంటలకు తుమ్మగూడెంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లోనూ, మధ్యాహ్నం 12 గంటలకు చాట్రాయిలోని ఆర్సీఎం చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.