• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు…ప‌రిస్థితి విష‌మం

టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. ఇవాళ తెల్ల‌వారుజామున‌ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో విజ‌య‌వాడ‌లోని ర‌మేశ్ ఆసుప‌త్రిలో వైద్యులు ఆయ‌న‌కు స్టంట్ వేశారు. బ‌చ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉంది. ఆయ‌న ఆరోగ్య‌ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. మ‌రో 24 గంట‌లు గ‌డిచాక మ‌రోసారి ప‌ర...

January 29, 2023 / 10:05 AM IST

మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

హిందువులు జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ, పార్వతులకు వివాహం జరిగిన రోజు కూడా అదే. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదిన రానుంది. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఏపీలోని ప్రముఖ శైవ క్...

January 29, 2023 / 09:22 AM IST

4 గంటల పాటు అవినాష్ రెడ్డి విచారణ

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. కాల్ డేటా మొదలు ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం మరోసారి రావాలని సూచించింది సిబిఐ. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా కొంతమంది బురద జల్లుతున్నారని, అందుకే విచారణను వీడియో తీయమని కోరగా అంగీకరించలేదని చెప్పారు అవినాష్. న్యాయవాదిని కూడా ...

January 29, 2023 / 09:21 AM IST

ఫిబ్రవరి చివరి వారంలో ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు…

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారింభించి 22 రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించింది. మార్చి 3,4 తేదీల్లో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ 2.65 లక్షల కోట్ల నుంచి 2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్న...

January 29, 2023 / 08:43 AM IST

అనారోగ్యంతో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత..

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వట్టి వసంత్‌కుమార్‌ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల. 1955లో ఆయన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్‌ క...

January 29, 2023 / 07:28 AM IST

నాందేడ్ లో బిఆర్ఎస్ రెండో బహిరంగ సభ

ఖమ్మంలో బీఅర్ఎస్ ఆవిర్భావ సభ పది రోజుల క్రితం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తర్వాత ఏపీలోని విశాఖలో రెండో బహిరంగ సభ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో ఉండనుంది. నాందేడ్‌లో వచ్చే నెల 5వ తేదీన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పోలీసుల అనుమతి వచ్చింది. 5న కెసిఆర్ సమక...

January 29, 2023 / 06:46 AM IST

తారకరత్న భార్య, తండ్రికి ధైర్యం చెప్పిన చంద్రబాబు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పురంధేశ్వరి, చంద్రబాబు సాయంత్రమే వచ్చారు. నిన్నటి నుంచి తారకరత్నతోనే బాలకృష్ణ కూడా ఉన్నారు. తారకరత్న తండ్రి, భార్య, కూతురు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. తారకరత...

January 28, 2023 / 09:31 PM IST

నాలుగున్నర గంటలు విచారణ.. మళ్లీ పిలుస్తానన్నారు: అవినాశ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు విచారణ చేశారు. మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని.. సీబీఐ విచారణకు సహకరిస్తానని అవినాశ్ తెలిపారు. అధికారులకు ఉన్న అనుమానాలకు సమాధానం ఇచ్చానని.. వీడియో, ఆడియోకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తదుపరి విచారణ కోసం మళ్లీ పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు...

January 28, 2023 / 08:48 PM IST

వస్తుందదిగో యువగళం.. తెస్తుందదిగో నవశకం.. లోకేష్ ‘యువగళం’ పాట

ఆంధ్రుల ఆత్మగౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై.. అంటూ సాగే యువగళం పాటను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. సోషల్ మీడియాలో యువగళం పేరుతో ఈ పాటను విడుదల చేసింది. నారా లోకేశ్ శుక్రవారం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ పాదయాత్రలో రెండో రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. వస్తుందదిగో యువగళం.. తెస్తుందదిగో నవశకం అంటూ ఈ పాట సాగుతుంది. మొత్తానికి ఈ పాట వి...

January 28, 2023 / 08:30 PM IST

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పుడు కూడా తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అయినా కూడా శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో బాలకృష్ణ ఉన్నారు. ఆసుపత్రికి చంద్రబాబు, పురందేశ...

January 28, 2023 / 08:15 PM IST

సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న

ఏపీ సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై ఆమె విమర్శలు గుప్పించారు. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు ఆనందంగా ఉన్నారని.. కేవలం అధికారం కోసమే యాత్రలు చేస్తున్నారని, చంద్రబాబును సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు.

January 28, 2023 / 07:34 PM IST

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు. సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్...

January 28, 2023 / 07:17 PM IST

నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వైద్యులు ఇంతకుముందే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు బెంగళూరుకు వస్తున్నారు. చంద్రబాబు కూడా ఇంతకుముందే ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం తారకరత్న ఐసీయూలో ఉన్...

January 28, 2023 / 07:06 PM IST

ఎన్టీఆర్ లా పవన్ కు వెన్నుపోటు.. ఆర్జీవీ హెచ్చరిక

ఒకనాటి దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాలు మానేసి తెలుగు రాష్ట్రాల్లో కాదు కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ పరిణామాలపై తరచూ స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. పవన్ కల్యాణ్ రాజకీయంపై వ్యంగ్యాస్త్రాలు తనదైన శైలిలో స్పందిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ కు కొందరు వెన్నుపోటు పొడుస...

January 28, 2023 / 06:13 PM IST

తలచుకుంటే వాళ్ల బెడ్రూమ్ లోకి వెళ్తా: వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురము జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దరెడ్డిపై ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పలు విషయాలపై వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. అయితే శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గంలో చే...

January 28, 2023 / 05:45 PM IST