మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వట్టి వసంత్‌కుమార్ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల. 1955లో ఆయన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తీరుపై కలత చెందిన ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.