నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పురంధేశ్వరి, చంద్రబాబు సాయంత్రమే వచ్చారు. నిన్నటి నుంచి తారకరత్నతోనే బాలకృష్ణ కూడా ఉన్నారు. తారకరత్న తండ్రి, భార్య, కూతురు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. తారకరత్నకు అందుతున్న చికిత్సపై డాక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు. తర్వాత ఆయన తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, కూతురు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి చంద్రబాబు ధైర్యం చెప్పారు.