PPM: సీతానగరం మండలం చినభోగిల గ్రామంలో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, డీఏంహెచ్వో ఎస్.భాస్కరరావు ఆదేశాల మేరకు బుధవారం స్కూల్ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.పావని జలుబు, దగ్గు, దురదలు ఉన్నవారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అలాగే, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సూత్రాలు గురించి వివరించి చెప్పారు.