నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసినప్పుడు కూడా తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. అయినా కూడా శాయశక్తులా తారకరత్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో బాలకృష్ణ ఉన్నారు. ఆసుపత్రికి చంద్రబాబు, పురందేశ్వరి చేరుకున్నారు. తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆసుపత్రికి రానున్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. తారకరత్న పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని పురందేశ్వరి తెలిపారు.