ASR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో బుధవారం నిర్వహించే మాటా మంతి కార్యక్రమానికి అడ్డతీగల ఎంపీడీవో ఏవీవీ కుమార్ హాజరవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖలో తన అనుభవాన్ని చెబుతూ ప్రజలకు మరింత మంచి సేవలు అందించడానికి నా యొక్క సూచనలు తెలుపుతానని ఎంపీడీవో కుమార్ పేర్కొన్నారు.