ఏపీ సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై ఆమె విమర్శలు గుప్పించారు. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలు ఆనందంగా ఉన్నారని.. కేవలం అధికారం కోసమే యాత్రలు చేస్తున్నారని, చంద్రబాబును సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు.