నెల్లూరు(టౌన్)కు చెందిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్(54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం వద్ద శుక్రవారం కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా, ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షరీఫ్ మరణించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.