ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో 1947 నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రం వెలువడింది. ఈ నేపథ్యంలో ఆనాటి నుంచి మెస్రం వంశీయులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకుని మహాపూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు.