సత్యసాయి: ధర్మవరం పోతుకుంటకు చెందిన కునుతూరు చిన్న వెంకటరెడ్డి శనివారం మరణించారు. విశ్వదీప సేవా సంఘం అవగాహనతో కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ టెక్నీషియన్ రాఘవేంద్ర కార్నియా సేకరించారు. ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన దాత కుటుంబ సభ్యులకు సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది.