ఒకనాటి దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాలు మానేసి తెలుగు రాష్ట్రాల్లో కాదు కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయ పరిణామాలపై తరచూ స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. పవన్ కల్యాణ్ రాజకీయంపై వ్యంగ్యాస్త్రాలు తనదైన శైలిలో స్పందిస్తూ ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ కు కొందరు వెన్నుపోటు పొడుస్తారని.. జాగ్రత్తగా ఉండాలని జనసేన పార్టీ నాయకులకు హెచ్చరించాడు. ఈ విషయాన్ని తనకు కలలో దేవుడు చెప్పాడని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ లా వెన్నుపోటుకు పవన్ గురవుతాడని తెలిపాడు.
‘ఆనాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ని నాదెండ్ల భాస్కర్ రావు, మళ్లీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్టే ఈసారి పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారు అని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు’ అని మొదటి ట్వీట్ చేశాడు.
రెండో ట్వీట్ లో ‘ప్రియమైన జన సైనికులారా దయచేసి మన లీడర్నీ, వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉంమని చెప్పండి. ఇంతకుముందు పవనిజం పుస్తకం రాసిన రాజురవితేజకు ఇలాగే వార్నింగ్ ఇచ్చా. నా మాటే నిజమైంది. జై జనసేన’ అంటూ ఆర్జీవీ పోస్టు చేశాడు.
చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ పట్ల పవన్ కల్యాణ్ ను జాగ్రత్తగా చూసుకోవాలని జన సైనికులకు సూచించారు. ఈ రెండు ట్వీట్ల ద్వారా తెలుగు రాష్ట్ర చరిత్రలో జరిగిన పెద్ద వెన్నుపోట్లను గుర్తు చేశాడు. ఆర్జీవీ ట్వీట్లను గమనిస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ వాడుకుని వదిలేస్తారని చెప్పకనే చెబుతున్నాడు. ఈ విధంగా ఏపీ రాజకీయాలపై రోజుకో విధంగా ఆర్జీవీ స్పందిస్తున్నాడు.
ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్ , ఎన్టీఆర్ ని #నాదెండ్లభాస్కర్రావు , ఎన్టీఆర్ ని మళ్ళీ @ncbn వెన్ను పోటు పొడిచినట్టే ఈసారి @pawankalyan ని #నాదెండ్లమనోహర్ , @ncbn ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు