టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో 24 గంటలు గడిచాక మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నట్లు డాక్టరులు వివరించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో ఉన్న తెలుగు తమ్ముళ్లకు మరో చేదు వార్త వినిపించింది.
అర్జునుడు 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం మచిలీపట్నం. గతంలో ఆయన మచిలీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్ గానూ పని చేశారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అర్జునుడి విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు, వైద్యులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ ముఖ్యనేతలు రమేశ్ ఆస్పత్రికి చేరుకుని బచ్చుల ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు.