chandrababu reaches narayana hospital in bengaluru
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వైద్యులు ఇంతకుముందే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు బెంగళూరుకు వస్తున్నారు. చంద్రబాబు కూడా ఇంతకుముందే ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్నను ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం తారకరత్న ఐసీయూలో ఉన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తోంది. నిన్నటి నుంచి బాలకృష్ణ.. తారకరత్న వెంటే ఉన్నారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉండి తారకరత్నను దగ్గరుండి చూసుకుంటున్నారు.