తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుతున్నారు. కాగా, సాయంత్రం మలయప్పస్వామిని కల్పవృక్ష వాహనంపై విహరించారు.
సూర్య ప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కరోనా తర్వాత తొలిసారి తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులకు భారీగా తరలివచ్చారు.