విశాఖ శ్రీ శారదాపీఠంని మంత్రి రోజా సందర్శించారు. అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలో భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం పర్యాటక శాఖ తీసుకుంటున్న చర్యలు స్వామివారికి మంత్రి వివరించారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్నటువంటి చర్యలు తన దృష్టికి వచ్చాయని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని రోజాని స్వామి అభినందించారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజంను ప్రభుత్వం అభివృద్ది భక్తులకు పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఏపీ పర్యాటకశాఖ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టామని రోజా తెలిపారు