విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తన లవర్ కి ఇంట్లోని నగలు, నగదు రహస్యంగా ఇచ్చింది. అంతేకాదు అతడినికి ఇవ్వడానికి మరిన్ని డబ్బులు కూడా ఇవ్వమని తండ్రిని కోరింది. అయితే కూతురుకి తండ్రి డబ్భులు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో తండ్రీకూతుర్ల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే తండ్రిపై కూతురు ఏకంగా కత్తితో దాడి చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.