PPM: ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా శుక్రవారం ఉదయం పాలకొండలోని రెల్లివీధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అలాగే శనివారం DSP ఆధ్వర్యంలో మెగా కార్డెన్ సెర్చ్ చేపడతున్నట్లు స్దానిక CI ఏ. ప్రసాదరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల ముప్పును నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.