శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉండాలంటే ఆ పార్టీ సరిగా ఉండాలని ఆయన అన్నారు. గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తు ఉంటుందని, లేకపోతే ఒంటరి పోరాటమే అని పవన్ స్పష్టం చేసారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. నన్ను నమ్మి ఓటు వేయాలని సభకు హాజరైన ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు. నేను సాధించిన దానికి సంతోషం లేదు కానీ నేను ఈరోజు ప్రతి సన్నాసితో మాట అనిపించుకోకుండా ఉండగలనని అన్నారు. కేవలం మన కోసం జీవించే జీవితం కాకుండా సాటి మనిషి గురించి బతకడం ఇష్టం అని అన్నారు. రాజకీయ నేతలు ప్రజలను బానిసలుగా చూస్తున్నారు. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా వద్ద అంత సమూహాం లేదని అన్నారు. మహా అయితే నా ప్రాణం పోతుంది, పిరికితనమంటే నాకు చిరాకు అని అన్నారు. రాజకీయ నాయకులు పైనుంచి దిగొచ్చారా? అని పవన్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డ అని పేర్కొన్న ఆయన ఉపాధిలేనప్పుడు , వలసపై నాయకులు నిలదీయకపొతే ఎలా..? అని ప్రశ్నించారు.
ఆఖరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. రణస్థలం నుంచి హామీ ఇస్తున్నానని పవన్ అన్నారు. నేను సినిమాలు చేయాలి నాకు వేరేదారి లేదని అన్నారు. డబ్బు నాకు అవసరం లేని రోజు వస్తే సినిమాలు వదిలేస్తానన్నారు పవన్ కల్యాణ్. రైతులకు గిట్టుబాటు ధరలేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, ఉద్యోగులకు జీతం లేదు అని పవన్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మూడు ముక్కల ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. మీ నాన్నవైఎస్ రాజశేఖరరెడ్డినే ఎదుర్కొన్నొడిని, పంచలూడ దీసికొడతా అన్నానని గుర్తుచేశారు. మీ నాన్న మనుషులు వేదిక మీద ఉండగా.. మాట్లాడుతుండగా స్టేజ్ కూల్చేయడం, బెదిరించడం నా కళ్లారా చూశానని అన్నారు. చిన్నవయసులోనే తీవ్రవాద ఉద్యమం వైపు వెళ్లాలనుకున్నా. కాంప్రమైజ్ అయి బ్రతకలేనని అన్నారు. మీరందరూ కలిసి పది మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఉంటే పెద్ద ఎత్తున చట్టసభల్లో పొరాడగలనని పవన్ అన్నారు అన్నారు. డైమండ్ రాణీ రోజా కూడా నాగూర్చి మాటాడుతుంది, చీ.. నా బతుకు చెడ.. మీకొసం డైమండ్ రాణితో , సంబరాల రాంబాబు తో తిట్టించుకుంటున్నా అంటూ ఆయన అన్నారు. పనికిమాలిన నీచ నికృష్ట కమీన్ ఐటీ మంత్రి మహిళ మీద మర్డర్ కేసు పెట్టాడని, నా మీద సుపారి ఇస్తారు. చంపేస్తాం అంటారని పవన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.