నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభమై.. రాత్రి 7.20 గంటలకు ముగియనుంది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను లోకేశ్ కలిసి, సమస్యలను తెలుసుకుంటున్నారు. యాత్రకు మహిళలు బ్రహ్మారథం పడుతున్నారు. స్వాగతం పలికి, వీర తిలకం దిద్దుతున్నారు. తమ సమస్యలు లోకేశ్‌తో చెప్పుకుంటున్నారు. చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి నాలుగో రోజు (సోమవారం) ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఒక్కో నియోజకవర్గంలో మూడురోజుల పాటు నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. ఈ రోజు కుప్పం నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తోంది. మొత్తం 400 రోజులపాటు సుదీర్ఘంగా జరిగే పాదయాత్ర 4 వేల కిలోమీటర్ల మేర సాగనుంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు షెడ్యూల్ ఇలా ఉంది.
–ఉదయం 8 గంటలకు కుప్పం నియోజకవర్గం చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి పాదయాత్ర ప్రారంభం.
–ఉదయం 8:45కి పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశం.
–ఉదయం 9:30కి వి.కోట మండలం కెంగుటం పంచాయతీ, కోరకుంటలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ప్రముఖులతో భేటీ
–ఉదయం 10:10కి వి.కోట మండలం, పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులతో ముఖాముఖి.
–ఉదయం 10:40కి వి.కోట మండలం గాంధారమాకులపల్లెలో వడ్డెర సామాజికవర్గ ప్రజలతో సమావేశం.
–మధ్యాహ్నం12:20కి వి.కోట మండలం జి.ఎం.ఆర్ కళ్యాణమండపంలో యువతతో భేటీ.
–మధ్యాహ్నం 02:05కి వి.కోట మండలం పి.ఎం.ఆర్ సత్రం వద్ద భోజన విరామం.
–సాయంత్రం 04:15కి వి.కోట మండలం ఆఘ కళ్యాణ మండపం ఎదురుగా గల బహిరంగ స్థలంలో ముస్లింలతో సమావేశం.
–రాత్రి 07:20కి వి.కోట మండలం కృష్ణపురం టోల్ గేట్ సమీపంలో రాత్రి బస.