tdp leaders devineni uma and chinarajappa in bengaluru
నందమూరి తారకతర్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇంకా చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. మరోవైపు బెంగళూరుకు నందమూరి కుటుంబ సభ్యులు బయలుదేరారు. సాయంత్రం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరుకు రానున్నారు. టీడీపీ ముఖ్య నేతలు కూడా బెంగళూరుకు చేరుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు.
తారకరత్న వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, మా ప్రయత్నం మేం చేస్తున్నామని వైద్యులు తెలిపారని చినరాజప్ప అన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని చినరాజప్ప వెల్లడించారు. డాక్టర్లు కూడా తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమ స్పష్టం చేశారు. చంద్రబాబు సాయంత్రం వస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారని ఆయన తెలిపారు.