కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో సీబీఐ టీమ్ ప్రశ్నలు సంధిస్తోంది. అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే.. న్యాయవాదిని మాత్రం సీబీఐ అధికారులు అనుమతించలేదు. సీబీఐ ఆఫీసుకు అవినాష్ అనుచరులు భారీగా తరలివచ్చారు. సీబీఐ ఆఫీసుకు వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు చేరుకున్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అధికారులు అవినాష్ ను ప్రశ్నిస్తున్నారు. అవినాష్ కాల్ డేటా, లావాదేవీలపై సీబీఐ ఆరా తీస్తోంది.
అవినాష్ కోరినట్టుగా లైవ్ వీడియో రికార్డింగ్ చేయాలని.. దర్యాప్తును నిష్పక్షపాతంగా జరగాలని.. నిజాలు తెలియాలంటే వీడియో రికార్డింగ్ బయటపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.