తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీడీ సిబ్బంది భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారు వెండి రథంపై మాఢవీధుల్లో ఊరేగనున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి.
తిరుమలలో నేడు వాహన సేవలు ఏ విధంగా ఉండనున్నాయంటే.. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం ఊరేగారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం శ్రీవారు కనిపించనున్నారు. అలాగే 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు కల్ప వృక్ష వాహనంపై విహరిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై శ్రీ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. చివరగా చంద్రప్రభ వాహనంతో సేవలు ముగియనున్నాయి. రథసప్తమి సందర్భంగా వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది.