వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్తూ వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల విచారణకు హాజరుకానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకున్నారు. అవినాశ్ స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో పలువురి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అధికారులు వైసీపీ ఎంపీకి కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు. వివేకా హత్య కేసులో నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అంటూ ఎంపీ అన్నారు. నా స్టేట్ మెంట్ రికార్డు చేసే ఆడియో, వీడియోలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.