వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు జారీచేసింది. దర్యాప్తునకు హాజరుకావాలంటూ సూచించింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు.
వివేకా హత్యకేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో అవినాష్ రెడ్డిని విచారించనున్నారు సీబీఐ అధికారులు. 2019 మార్చి 15న వివేకా పులివెందులలోని సొంత ఇంటిలోనే గొడ్డలిపోటుతో దారుణ హత్యకు గురయ్యారు. ఇది తెలిసి అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి మరికొందరు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బెడ్రూమ్, బాత్రూంలో రక్తం మరకలను కడిగించేసి గుండెపోటుగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.