nara lokesh reaches pes hospital to meet taraka ratna
నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యబృందం పర్యవేక్షణలో బెంగళూరుకు తీసుకెళ్లారు. తారకరత్నను హాస్పిటల్ లో చేరిన సమయం నుండి బాలకృష్ణ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు బాలయ్యకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి పలుమార్లు ఆరా తీశారు. నారా లోకేష్ నిన్న హాస్పిటల్ కు వెళ్ళారు. బాలకృష్ణ బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులతోనూ సంప్రదింపులు జరిపారు.
తారకరత్న గుండె ఎడమ వైపు నాళాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయని, డాక్టర్లు శక్తి మేర చికిత్స అందించినట్లు తెలిపారు. ఆందోళన అవసరం లేదన్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, కుమార్తెలు హాస్పిటల్ లో ఉన్నారు.