నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స చేయిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని వైద్యులు తెలిపినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి తారకరత్నతోనే ఉన్నారు. ఇవాళ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా త్వరలోనే బెంగళూరుకు చేరుకోనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం బెంగళూరుకు వెళ్లనున్నారు. ప్రస్తుతం తారకరత్నకు ఎక్మోపై చికిత్స చేస్తున్నారు.