• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తామరలో ఎమ్మెల్యే ఇంటింట ప్రచారం

SKLM: పాతపట్నం మండలం తామర గ్రామంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి డోర్ టు డోర్ డ్రైవ్ ద్వారా ప్రజలకు ప్లాంట్ ప్రారంభంపై అవగాహన కల్పించారు. ఈ ప్లాంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

March 22, 2026 / 01:00 PM IST

‘ప్రతి చుక్కను కాపాడుకుందాం’

WG: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఇవాళ ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా జరిగింది. నీటి సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజంటేషన్ పోటీలు నిర్వహించారు. నీరు జీవనాధారమని, ప్రతి ఒక్కరు వృథాను అరికట్టి జల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 12:56 PM IST

‘సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి’

W.G: దివ్యాంగుల సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఏపీ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లాడి నటరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ ఆయన ఆకివీడులో మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా దివ్యాంగుల అభివృద్ధికి చర్యలు చేపట్టలేదన్నారు. బ్యాక్ లాగ్ ఉద్యోగాలు, స్కూటీలు, బ్యాంకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

March 22, 2026 / 12:51 PM IST

విశాఖకు తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్

VSP: ఏపీలో తొలి సెమీకండక్టర్ యూనిట్‌కు విశాఖ ఎంపికైంది. ఆనందపురం మండలం తర్లువాడలో 30 ఎకరాల్లో ఏఎస్ఐపీ సంస్థ రూ.2,387 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఆదివారం ఈ నిర్ణయం ప్రాధాన్యం పొందింది. రెండు దశల్లో నిర్మాణం పూర్తై 1,000 ఉద్యోగాలు లభించనున్నాయి. 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయాడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

March 22, 2026 / 12:48 PM IST

గంజాయి నిందితులకు కౌన్సెలింగ్

PKSM: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 22, 2026 / 12:48 PM IST

వారాహి అమ్మవారిని దర్శించుకున్న ఏఎస్పీ

కడప నగరంలోని అక్కాయపల్లెలో ఉన్న వారాహి అమ్మవారిని ఏఎస్పీ రమణయ్య ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి మహిమ, ఆలయ అభివృద్ధి గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

March 22, 2026 / 12:45 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింకకు గాయాలు

TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు రోడ్డుకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఒక జింక రోడ్డుపైకి వచ్చింది. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రోడ్ సేఫ్టీ సిబ్బంది జింకను సంరక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నీటి కొరత కారణంగా అడవిలోని జంతువులు బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

March 22, 2026 / 12:40 PM IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎంపీ

సత్యసాయి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా, విద్యుత్ సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

March 22, 2026 / 12:40 PM IST

భూ వివాదం.. రైతుపై దాడి

అన్నమయ్య: రామసముద్రం మండలంలో భూ వివాదం నేపథ్యంలో రైతు మంజునాథ్‌పై అదే గ్రామానికి చెందిన సిద్దరాజు, వెంకటరమణ, శ్రీనివాస్‌లు ఇవాళ దాడి చేశారు. పొలం వద్దకు వెళ్లిన మంజునాథ్‌పై బండరాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి బాధితుడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 22, 2026 / 12:38 PM IST

‘పిల్లలకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక అవసరం’

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో గత కొన్ని నెలలుగా గ్రామంలోని పిల్లలకు ప్రతి ఆదివారం భగవద్గీత పారాయణం నేర్పిస్తున్నట్లు గురువులు రూపా వెంకటలక్ష్మి తెలిపారు. తరగతులకు పిల్లల నుంచి విశేష స్పందన లభిస్తోందని, చిన్నారులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థంగా, స్పష్టంగా పలుకుతూ చెప్తుండడం ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె తెలిపారు.

March 22, 2026 / 12:37 PM IST

రేపు పిఠాపురం పాడాలో PGRS కార్యక్రమం రద్దు

KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు పాడా పీడీ భవాని శంకర్ ఆదివారం తెలిపారు. అనివార్య కారణాల వల్ల 23వ తేదీన ఈ వేదిక నిర్వహించడం లేదని పేర్కొన్నారు. అర్జీదారులు, అధికారులు ఈ మార్పును గమనించాలని సూచించారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ అర్జీలను అందజేయవచ్చని భవాని శంకర్ వివరించారు.

March 22, 2026 / 12:33 PM IST

సీఎం నిధులతో నిరుపేదలకు భరోసా

NDL: అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ఇవాళ బొల్లవరంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వీరం రాములమ్మకు రూ.45,527, సుధాకర్ రెడ్డికి రూ.47,967 మంజూరు అయ్యాయి. సహాయం అందడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

March 22, 2026 / 12:33 PM IST

రూ. 40 లక్షలతో పార్కు ప్రారంభం

NLR: సిటీలోని బలిజపాలెంలో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో సిద్ధమైన పార్క్‌ను మంత్రి నారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏసీ మినీ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు.  అనంతరం ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్కులో జిమ్ చేసి, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేస్తూ వారితో సరదాగా గడిపారు. 

March 22, 2026 / 12:32 PM IST

‘సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలి’

VZM: సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలని ఏపీ రజక సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కెల్ల సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం గజపతినగరంలో రజకలతో సమావేశం నిర్వహించారు. సమస్యలపై ఏప్రిల్ 13వ తేదీన రజకులు కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తారని అన్నారు. రజకలను ఎస్సీలో చేర్చినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తామాడ అచ్చన్న, టీవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 12:31 PM IST

పెదకూరపాడులో రేణుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

PLD: పెదకూరపాడులో శ్రీ రేణుక అంకమ్మ తల్లి జాతర సందర్భంగా మాజీ టీడీపీ అధ్యక్షుడు రమేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలతో, మండలం అభివృద్ధి సంక్షేమాల ప్రగతి పథంలో ఉండేలా ఆశీర్వదించమ్మా అంటూ రేణుక అంకమ్మకు భక్తులు ప్రణమిల్లారు. యాదవ కులస్తుల ఆరాధ్య దైవం రేణుక అంకమ్మ తల్లి కొలుపుల మహోత్సవం ఇవాళ ఘనంగా చేపట్టారు. 

March 22, 2026 / 12:30 PM IST