VSP: ఏపీలో తొలి సెమీకండక్టర్ యూనిట్‌కు విశాఖ ఎంపికైంది. ఆనందపురం మండలం తర్లువాడలో 30 ఎకరాల్లో ఏఎస్ఐపీ సంస్థ రూ.2,387 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఆదివారం ఈ నిర్ణయం ప్రాధాన్యం పొందింది. రెండు దశల్లో నిర్మాణం పూర్తై 1,000 ఉద్యోగాలు లభించనున్నాయి. 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయాడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.