అన్నమయ్య: రామసముద్రం మండలంలో భూ వివాదం నేపథ్యంలో రైతు మంజునాథ్‌పై అదే గ్రామానికి చెందిన సిద్దరాజు, వెంకటరమణ, శ్రీనివాస్‌లు ఇవాళ దాడి చేశారు. పొలం వద్దకు వెళ్లిన మంజునాథ్‌పై బండరాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి బాధితుడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.