MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో సబ్బని సంతోష్ (40) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. సంతోష్ తల్లి భాగ్యమ్మ 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి సంతోష్ తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. ఈ క్రమంలో భార్యను మేనమామ ఇంటికి పంపి తాను వస్తానని చెప్పి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.