NRPT: మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాకు చెందిన దేవిబాయికి ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇల్లును బుధవారం మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.