BDK: శ్రీరామనవమి మహోత్సవాల ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, బారికేడింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. వైద్య, విద్యుత్, తాగునీరు, రహదారుల పనుల్లో ఏమరపాటు వద్దని, అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.