RR: వనస్థలిపురం డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి అనుమతివ్వాలని జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్‌ను మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. యశోదానగర్, ఓల్డ్ విలేజ్ చింతలకుంట, న్యూవెంకటరమణ కాలనీ, అభ్యుదయనగర్ ప్రాంతాల్లో సరైన కమ్యూనిటీ హాల్స్ లేక స్థానికులు సమావేశాలు నిర్వహించుకోలేకపోతున్నారని వినతి పత్రం అందజేశారు.