CTR: జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లకు చెందిన ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. ఈ జనగణన ఫలితాలు రాబోయే 15 సంవత్సరాల అభివృద్ధిపై ప్రభావం చూపుతాయని కలెక్టర్ తెలిపారు.