AP: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం బస్సు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించి వివరణ ఇచ్చారు. ’28 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. అద్దాలు పగలగొట్టుకుని కొందరు బయటపడ్డారు. టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు వచ్చినట్లు కనిపిస్తోంది. మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది’ అని తెలిపారు.