AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం హరికృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ప్రమాదానికి కారణం మూల మలుపులో అతివేగమా? డ్రైవర్ నిద్రమత్తా? అనేది తెలియాల్సి ఉంది. సెమీ స్లీపర్ బస్సు కావడంతో ప్రయాణికులు బయటపడటానికి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది స్లీపర్ బెర్తులపై ఉన్నట్లు గుర్తించారు.