TG: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TGTDC) బుద్ధవనం విభాగం, వియత్నాం బౌద్ధ సంఘం ఆధ్వర్యంలో ‘ప్రపంచ శాంతి-అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు-2026’ను నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఈనెల 29 వరకు హైదరాబాద్, నాగార్జునసాగర్ వేదికలుగా వేడుకలు జరగనున్నాయి. 22 దేశాల నుంచి 150 మంది ప్రముఖ బౌద్ధ ప్రతినిధులు, పరిశోధకులు హాజరు కానున్నారు. బేగంపేటలోని ప్లాజా హోటల్లో మహాసభలు ప్రారంభమవుతాయి.