TG: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ స్పీకర్ ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం పద్దులపై చర్చ జరపనున్నారు. మున్సిపల్, బీసీ వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ తదితర విభాగాల పద్దులపై చర్చ జరగనుంది.