BHPL: జిల్లాలోని మంజూరు నగర్లో నూతన SBI బ్రాంచ్‌ను ఇవాళ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు, ఏటీఎం సేవలు వంటి అన్ని రకాల సేవలు ఈ బ్రాంచ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.