NLR: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2026 ఉత్తమ ర్యాంకు సాధనే లక్ష్యంగా కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, మురికివాడల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కాలువల పూడికతీత అనంతరం సిల్ట్‌ను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.