సత్యసాయి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా, విద్యుత్ సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.