KRNL: పార్టీకి బలం, బలగం సోషల్ మీడియా సైనికులేనని ఎమ్మెల్యే విరుపాక్షి, తనయుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇవాళ చిప్పగిరిలో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం సోషల్ మీడియా సైనికుల బాధ్యత అని అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
KDP: పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.
సత్యసాయి: లేపాక్షిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ అర్చకుడు ఎంవి శ్రీనివాస్ కుమార్ ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ తరపున ఈవో ఎంహెచ్ నరసింహమూర్తి, కేంద్ర ప్రభుత్వ శాఖ ఎంఎటీఎస్ రాము, టూరిజం గైడ్స్, ఆలయ సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, అధికారులు పాల్గొన్నారు.
E.G: రాజమండ్రి 45వ డివిజన్ ఎస్‌ఎస్‌ఆర్ లేఅవుట్ శివాలయం ప్రాంతంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రకాశం: పొన్నలూరు గ్రామ నడిగడ్డ దగ్గర పేకాట ఆడుతున్న ఆరు మంది వ్యక్తులను ఎస్ఐ సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,280 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
BPT: సంతమాగులూరు మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేవూరి వాసిరెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇకపై కూడా రవికుమార్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని, కూటమిని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని నాయకులు సంకల్పించారు.
SKLM: పోలాకి(M) దీర్ఘాసి భవాని కాలనీలో దుర్గాగిరి అమ్మవారి 11వ జాతర మహోత్సవం ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరరావు ఉన్నారు.
TPT: తిరుమల తిరుపతి దేవస్థానాలుకు చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ రూ. కోటి విరాళం అందించింది. ఈ విరాళాన్ని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి అందించారు. దాత జే. రాజా రమేష్, టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
ASR: ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఆదివారం జరిగిన బస్తర్ హెరిటేజ్ మారథాన్ పోటీలలో అల్లూరి జిల్లా అరకులోయ మండలానికి చెందిన నలుగురు పిల్లలు పాల్గొన్నారు. 42km మారథాన్‌లో కిల్లో బుద్దు, 21kmలో కొర్రా గోపి, 5kmలో బురిడి జానిబాబులు పాల్గొని టాప్ 20లో నిలిచారు. అలాగే 5km సబ్ జూనియర్ మారథాన్‌లో పాల్గొన్న కిల్లో వినాయక్(8) టాప్ 5లో నిలిచాడు.
ATP: తాడిపత్రిలో ఓ వ్యక్తి మటన్ ఉడకలేదని వంట పాత్రతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఉగాది సందర్భంగా కొన్న మాంసాన్ని ఎన్నిసార్లు ఉడికించినా ఉడకకపోవడంతో సదరు విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు చేరుకున్నాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన పోలీసులు ఆ వ్యక్తికి సర్దిచెప్పి పంపించారు. ఈ వింత ఘటన స్థానికంగా నవ్వులు పూయించింది.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జియోటెక్నికల్ అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ ఆదివారం ప్రారంభమైంది. ఐఐటీ ఢిల్లీ మాజీ సంచాలకులు ఆచార్య వీ.ఎస్. రాజు కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థి అభివృద్ధికి విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ జ్ఞానం, అనుభవంతో విద్యాలయం అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
ASR: గంజాయి, నాటు సార వంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. ఆదివారం అరకులోయ మండలం, మాదల గ్రామంలో నిర్వహించిన ‘మీ కోసం మీ పోలీస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంజా సాగు, రవాణ, వినియోగం నేరమని, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని ఎస్సై గోపాలరావు హెచ్చరించారు.
KDP: సింహాద్రిపురం (M) బలపనూరులో నగరికుంట, రాగికుంట, నాగులకుంట, ఊరుకుంటలు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 400 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న పంటలు సాగు చేయడానికి సిద్ధమవుతున్న రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. బలపనూరు డిస్ట్రిబ్యూటర్‌ని కాలువలకు మళ్లించి కుంటలు నింపితే వేసవిలో ఉపయోగపడుతుందని రైతులు కోరుతున్నారు.
PPM: భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ క్లినిక్‌లో పిర్యాదు చెయ్యొచ్చని తెలిపారు. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలు తెలియజేయడంతో పాటు 1100 కాల్ సెంటర్‌కు కాల్ చేసి కూడా తెలియవచ్చు అన్నారు.
CTR: చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం రేపు ఉదయం 10:30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు.