• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న శ్రీరామ నవమి వేడుకలు

ATP: గార్లదిన్నె మండలం కల్లూరులో ఈనెల 27న శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇసుక మూట బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ..120 కేజీల ఇసుక మూట ఎత్తుకొని 10 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా నిర్ణయిస్తామన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేస్తామన్నారు.

March 22, 2026 / 11:30 AM IST

‘పారా అథ్లెటిక్స్‌లో నంద్యాల యువకుడు గౌతమ్’

NDL: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన గౌతమ్ రజత పతకం సాధించారు. F-41 కేటగిరీ షాట్‌పుట్‌లో ఈ విజయాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. గౌతమ్ విజయంపై జిల్లాలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు.

March 22, 2026 / 11:28 AM IST

మార్కాపురంలో ఉచిత పశు వైద్య శిబిరం

PKSM: మార్కాపురం పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువర్ధక శాఖ సహకారంతో ఇవాళ ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. గేదెలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, తెలుగుదేశం నాయకులు, శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

March 22, 2026 / 11:22 AM IST

దారుణం.. హత్య చేసి కాల్చేశారు

NLR: నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య ఘటన కలకలం రేపుతోంది. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చివేసిన శవం లభ్యమయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 11:19 AM IST

అక్కడ నైట్ రాత్రి 9.30 తర్వాతే విద్యార్థులకు ఫుడ్!

తిరుపతి చెన్నారెడ్డి కాలనీ ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్లో పిల్లలతో పూరీలు రుద్దించడం, వంట పనులు చేయించడం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు వార్డెన్లు ఉదయం డ్యూటీకి రాకపోవడం సమస్యగా మారింది. సమయానికి భోజనం ఇవ్వకపోవడంతో రాత్రి 9:30 గంటల తర్వాతే ఆహారం అందిస్తున్నారని, ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని విద్యార్థులు తెలిపారు.

March 22, 2026 / 11:15 AM IST

పెనుకొండలో కార్డెన్ సెర్చ్

సత్యసాయి: పెనుకొండ టౌన్ మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ కాలనీలో ఆదివారం పోలీసులు వజ్ర పహార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి గంజాయి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 21 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, పత్రాలు లేని 2 వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు.

March 22, 2026 / 11:13 AM IST

హనుమంతరాయ చౌదరి భౌతిక దేహానికి ఎమ్మెల్యే నివాళి

ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి భౌతిక దేహానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాళులర్పించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సాంతాపం తెలిపారు. టీడీపీ బలోపేతానికి హనుమంతరాయ చౌదరి చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

March 22, 2026 / 11:10 AM IST

బాల్య వివాహాన్ని అడ్డుకున్న శక్తి టీం

PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు వీరఘట్టం మండల కేంద్రం బీసీ కాలనీలో ఇంటర్మీడియట్ చదువుతున్న17 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేస్తున్నారన్న పాలకొండ శక్తి టీంకు సమాచారం వచ్చింది. అక్కడ జరుగుతున్న బాల్య వివాహాన్ని శక్తి టీం అడ్డుకుంది. బాలికకు, తల్లిదండ్రులకు బాల్య వివాహం చేయడం చట్టరీత్య నేరం అని తెలిపారు. దానివల్ల జరిగే అనార్థాలపై అవగాహన కల్పించారు.

March 22, 2026 / 11:09 AM IST

భారీగా తగ్గిపోయిన కొబ్బరి ధర

కోనసీమ: జిల్లాలో కొబ్బరి ధర రోజు రోజుకి దిగజారుతుంది. గత నెలలో రూ.22 నుంచి రూ.24 వరకు పలికిన కొబ్బరిధర ఆదివారంకి రూ.12 నుంచి రూ.14 కి పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రావడం లేదని అంటున్నారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో విదేశాలకు ఎగుమతి లేకపోవడంతో కొబ్బరి ధర పడిపోయిందని వ్యాపారస్తులు చెప్తున్నారు.

March 22, 2026 / 11:08 AM IST

అప్పన్న ఆలయంలో నేత్రపర్వంగా గరుడ సేవ

VSP: సింహాచలం వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.

March 22, 2026 / 11:03 AM IST

ఆర్పీఫ్ పోస్ట్‌ను ప్రారంభించిన డీఆర్ఎం

VZM: బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో రైల్వే రక్షక దళం పోస్ట్‌ను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర ప్రారంభించారు. నూతన భవనంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడానికి అత్యంత సదుపాయాలతో కూడిన సీసీ కెమెరాలు, రిసెప్షన్ సెంటర్, నేరాలు అరికట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఫ్ ఐజీ అలోక్ బోహ్ర, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 11:00 AM IST

YVUలో ఈ నెల 24, 25న సెమినార్

KDP: YVUలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో “నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణలు” (జీఎస్టీ 2.0) సెమినార్ జరగనుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థోమత, ఉపాధి, ఆరోగ్యం, స్థిరత్వం.. వికసిత్ భారత్‌పై ప్రభావం (GST ఏఈహెచ్ఎస్-2026) అనే అంశంపై 2 రోజుల జాతీయ సెమినార్ ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ పి.సరిత తెలిపారు.

March 22, 2026 / 10:56 AM IST

చీమకుర్తి తిరుణాళ్ల కరపత్రాల ఆవిష్కరణ

PKSM: చీమకుర్తిలో శ్రీ భావన ఋషిస్వామి దేవస్థానంలో రామతీర్థం గంగమ్మ తల్లి తిరుణాల సందర్భంగా పద్మశాలి అన్న సత్రం కరపత్రాలను ఆవిష్కరించారు. మొదట కరపత్రాలను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పట్టణ పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

March 22, 2026 / 10:53 AM IST

ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో రూ.14 లక్షల సైబర్ మోసం

KRNL: ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో సైబర్ మోసం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలవీరాంజనేయులు అనే వ్యక్తిని ఫైయర్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయమైన నేరగాళ్లు షేర్ ట్రేడింగ్‌లో లాభాల మాయతో నమ్మబలికారు. తొలుత లాభాలు చూపించి విశ్వాసం కల్పించి, అనంతరం రూ.14.04 లక్షలు తమ ఖాతాలకు జమ చేయించారు.

March 22, 2026 / 10:52 AM IST

రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత

TPT: సూళ్లూరుపేట మండలం కే.సీ.యన్ గుంటకు చెందిన తుమ్మ వెంకటరమణయ్య మరణించగా, ఆయనకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యాక్టివ్‌గా ఉండటంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. కెనరా బ్యాంకు ద్వారా క్లెయిమ్ చేసి రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని ఆయన భార్య సుప్రియకు అందజేశారు. తిరుపతి సర్కిల్ అధికారుల చేతుల మీదుగా ఈ చెక్కు అందించారు.

March 22, 2026 / 10:49 AM IST