CTR: ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పుంగనూరులోని అంజుమన్ షాదీమహల్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ MS సలీం తెలిపారు. శుక్రవారం పట్టణంలోని షాదీమహల్‌లో సమావేశమై క్యాంప్ నిర్వహణపై చర్చించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుష్మిత్ సాయి ఉదయాన్నే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ తీర్థ, ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
బాపట్ల: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాపట్ల అంబేద్కర్ భవన్‌లో శుక్రవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలెక్టర్ వెంకట మురళి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటబిడ్డలను చదివిద్దాం అనే నినాదంతో జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. స్కూల్ డ్రాప్ అవుట్ లేకుండా చేయటంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
TPT: APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) తిరుపతిలో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 18-45 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు మెడికల్ కళాశాల ఎదురుగా గల NAC కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 25అని పేర్కొన్నారు.
TPT: తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరికాసేపట్లో తిరుపతి నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.
NLR: కోవూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల అరాచకాలను అడ్డుకోవాలని కోరుతూ కొడవలూరు MPDO కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు శుక్రవారం ఉదయం 10 గంటలకు ధర్నా చేపట్టనున్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నియోజకవర్గంలోని వైసీపీ నేతలు పాల్గొననున్నారు.
NLR: ఉదయగిరిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం తప్పింది. పట్టణంలోని చాకలి వీధిలో ఓ విద్యుత్ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉందని పలుమార్లు స్థానికులు విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రదీప్ ఇంటి గేటుపై విద్యుత్ స్తంభం పడిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
CTR: పుంగనూరు అర్బన్ పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారిని ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల రంగులతో ఎంతో సుందరంగా అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
VSP: నాతవరం మండలం శృంగవరం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మాజీ సర్పంచ్ కొండ్రు అప్పారావు బీపీ మిషన్, డయాబెటిక్‌ను పరీక్షించే గ్లూకోమీటర్, తదితర పరికరాలను గురువారం వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. రూ.10,000 విలువైన ఆరోగ్య పరికరాలను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అప్పలనాయుడు పాల్గొన్నారు.
VSP: జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.
KDP: కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు పోలీస్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు ఎస్పీలను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడప ఎస్పీగా అశోక్ కుమార్ను నియమించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
కృష్ణా: తోట్లవల్లూరు ఎస్సైగా అవినాష్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్సైగా పనిచేసిన అర్జున్ రాజు బదిలీపై హెడ్ క్వార్టర్స్ర్కు వెళ్లగా ఆయన స్థానంలో అవినాష్ ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సైకు స్వాగతం పలికారు. అలాగే తోట్లవల్లూరులో పలువురు ప్రముఖులు ఎస్సైకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ASR: విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఎంవీడీఎం స్కూల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గురువారం ప్రారంభించారు. పోర్ట్ అథారిటీ పీపీపీ పథకం కింద వేదంతా జనరల్ కార్గో బెర్త్ సీఎస్ఆర్ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5,00,000 మంజూరు చేసింది. సోలార్ విద్యుత్ ప్లాంట్ కారణంగా నెలవారి విద్యుత్ బిల్లులు తగ్గనున్నాయి.
GNTR: భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సుభాష్ చంద్ర బోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాతృభూమిని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి ఐసీఎస్‌ను తృణప్రాయంగా త్యజించిన ఘనుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని సీఎస్ అన్నారు.
ASR: జీ.మాడుగుల మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24నుండి 27వ తేదీ వరకు మూసి వేయడం జరుగుతోందని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ గురువారం తెలిపారు. జలపాతం మూసివేసి ఆధునీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నాలుగు రోజులు పర్యాటకులను ప్రవేశం రద్దు చేయాలని కొత్త పల్లి జలపాతం సిబ్బందిని ఆదేశించారు. పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు.