KRNL: సహజ వనరులను పొదుపుగా వాడుకుని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని బృందావన్ భారత్ గ్యాస్ నిర్వహకురాలు బుగ్గన కోటేశ్వరి అన్నారు. శుక్రవారం పట్టణంలో భారత్ పెట్రోల్ కార్పొరేషన్ 49వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు బృందావన్ భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో సహజ వనరుల పొదుపు, వినియోగం పై అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
KRNL: బండి ఆత్మకూరు మండలం ఓంకార పుణ్యక్షేత్రం శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి పి. హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. పాదరక్షలు గత సంవత్సరం రూ.80వేలు రాగా.. ఈ సంవత్సరం రూ.82 వేలు, ఐస్ క్రీమ్ బండ్లు అమ్ముకొనే హక్కుకు గత ఏడాది రూ.29,500/-లు రాగా ప్రస్తుతం రూ.31000/-లు ఆదాయం లభించింది.
KRNL: కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటుచేసుకుంది. కోడుమూరు పట్టణానికి చెందిన ఆదిశేషులు కనిపించడం లేదని గురువారం నుండి కుటుంబ సభ్యులు గాలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కోడుమూరులో ఉన్న నర్సప్ప బావిలో ఆది శేషులు శవమై తేలడంతో కుటుంబీకులు బోరున విలపించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగుతుందని ఎన్నికల డీటీ పోతురాజు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ ఓటర్‌ను సన్మానం చేయటం, కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల డీటీ పోతురాజు తెలిపారు.
ప్రకాశం: అద్దంకి పట్టణంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం, చేపలు అమ్మడం నిషేధమని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి మాంసం, చేపలు అమ్మినా, వధించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఏలూరు: జంగారెడ్డిగూడెం పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలో పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన వారి సమస్యలపై సమగ్రంగా విచారణ చేసి వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.
W.G: బుట్టాయగూడెం మండలం అలివేలు వద్ద గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి పోలవరం MLA చిర్రి బాలరాజు శుక్రవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ITDA పీవో, RDO, జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పాల్గొన్నారు.
VZM: కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఉత్కర్ష్ మోహన్ బనార్కర్ ఈనెల19న విజయనగరం రైల్వే స్టేషన్‌లో అదృశ్యమైన సంగతి తెలిసిందే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో గౌహతి ట్రైన్‌లో బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై అశోక్ కుమార్ గురువారం తెలిపారు. త్రిపుర సమీపంలోని ధర్మనగర్ వద్ద విద్యార్థి ఆచూకీ గుర్తించామని తెలిపారు.
ఏలూరు: కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాలలో జనవరి 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌లో సుమారు 180 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివి వయసు 18-35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు.
W.G: ప్లాస్టిక్ వాడకంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్రజలందరూ సామాజిక బాధ్యతగా అరికట్టాలని రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. భీమవరం విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించారు.
NLR: సంగం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్లకు సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని..రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ATP: ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఏపీ మార్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మద్దతు ధర క్వింటాలకు రూ.7750లకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నాయక్, టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు, నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: రొద్దం మండలం సానిపల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంది పంట రైతులను పలకరించారు. కంది పంట రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తీ విఫలం అయ్యిందన్నారు. నష్టపోతున్న రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ కమిటీని ప్రకటించారు.
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వారి స్వగృహానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
GNTR: మేడికొండూరు మండలం పొట్లపాడు గ్రామంలో మినీ గోకులం షెడ్డును తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జంగంగుంట్లపాలెం గ్రామంలో రూ.4లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.